అంబర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk |

మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని దాన్ని అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. రోజు ఏదో ఒక చోట మద్యం తాగి ప్రమాదాలు చేయడం.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ అంబర్ పేటలో శనివారం తెల్లవారుజామున 4. 30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి బైకుపై వెళ్తున్న భార్యభర్తలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య మల్లమ్మ(30) అక్కడికక్కడే మృతి చెందగా భర్త బాలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆక్సిడెంట్ కు కారణమైన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM