రాష్ట్రంలో కొత్తగా 1,078 కొవిడ్‌ కేసులు
 

by Suryaa Desk |

 తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా 331 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం 6900 యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3,116 మంది బాధితుల హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసులు అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే 283 ఉన్నాయి. శుక్రవారం ఒకే రోజు 59,705 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM