తెలంగాణలో నేడు, రేపు గరిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు

byసూర్య | Fri, Apr 02, 2021, 08:44 AM

 తెలంగాణకు వడగాలుల ముప్పు పొంచి ఉంది. శుక్ర, శనివారాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భానుడి ప్రతాపంతో పాటు వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యంతో వేడి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్‌ నగరం కూడా వేడెక్కుతోంది. 18 జిల్లాలను వడగాలుల తీవ్రత జాబితాలో విపత్తుల శాఖ చేర్చింది. కుమురంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు మరింత ముప్పు ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM