శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
 

by Suryaa Desk |

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 1.026 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను విచారించి వారిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని తరలిస్తున్నాడు. ప్యాకింగ్ కవర్ల లోపలి పొరలలో బంగారు రేకుల రూపంలో దాచిపెట్టి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారాన్ని మరొక వ్యక్తికి అప్పగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.47.63 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM