టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్‌ను గెలిపించాలి : ఆర్‌.కృష్ణయ్య
 

by Suryaa Desk |

తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నికలు రాగా.. నోముల నర్సింహయ్య కుమారుడు భరత్‌ను బరిలోకి దింపింది టీఆర్ఎస్.. ఇక, సీనియర్ నేత జానారెడ్డి.. మరోసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు.. అయితే, సాగర్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగిసింది. అటు అన్ని పార్టీలు ప్రచారంలో ఫుల్‌ బిజీ అయిపోయాయి. అయితే నాగార్జున సాగర్‌ ఎన్నికల్లో అనూహ్యంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థికే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. నాగార్జున సాగర్‌ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని తాము చేసిన విజ్ఞప్తిని సీఎం కేసీఆ్‌ పరిగణలోకి తీసుకుని ఉద్యమాల వీరుడు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు కేటాయించారని పేర్కొన్నారు. బీసీలంతా భగత్‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి బీసీల కొత్త చరిత్రకు నాంది పలకాలని ఆయన కోరారు. అయితే.. ఆర్.కృష్ణయ్య మద్దతుతో టీఆర్‌ఎస్‌ మరింత బలం చేకూరింది


 


 


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM