నిజామాబాద్ లో దారుణం
 

by Suryaa Desk |

నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలోని కోసి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ చాటింగ్ కు ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఊరు పేరు తెలియని ఓ యువతితో ఫోన్ లో వీడియో చాట్ చేశాడు. యువకుడితో వీడియో చాట్ తరువాత ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి భయపడిన యువకుడు గ్రామంలోని పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతితో మాట్లాడిన నగ్న వీడియో టేప్ లు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు శ్రీకాంత్ హైదరాబాద్ లోని పంజాగుట్ట క్షత్రియ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 


 


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM