తెలంగాణలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు
 

by Suryaa Desk |

 తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 59,297 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 887 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1701కి చేరింది. కరోనా నుంచి మరో 337 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,01,564గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5,511 యాక్టివ్‌ కేసుల్లో 2,166 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM