వాహనదారులపై మరో భారం

byసూర్య | Thu, Apr 01, 2021, 08:12 AM

వాహనదారులపై మరో భారం పడింది. నేషనల్ హైవేలపై టోల్‌ చార్జీలు పెరిగాయి. ఒక్కో వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్ఠంగా రూ. 5 నుంచి గరిష్ఠంగా రూ. 25 వరకు, నెలవారి పాస్‌కు కనిష్ఠంగా రూ. 90 నుంచి గరిష్ఠంగా రూ.590 వరకు, లోకల్‌ పాస్‌కు రూ. 10 వరకు పెంచారు. హైదరాబాద్‌-విజయవాడ (65), హైదరాబాద్‌-భూపాలపట్నం (163) జాతీయ రహదారులను బీవోటీ పద్ధతిలో నిర్మించారు.


కాంట్రాక్ట్ సంస్థలు ఏడాదికోసారి టోల్‌ చార్జీలను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి, గూడురు, నల్గొండ జిల్లాలోని కొర్లపహాడ్‌, ఏపీలోని జగ్గయ్యపేట చిల్లకల్లు జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల దగ్గర బుధవారం అర్ధరాత్రి నుంచే కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఏడాది కాలం పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి.


 


* హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా దగ్గర కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 80, ఇరువైపులా కలిపి రూ. 120..


* లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సుకు ఒకవైపు రూ. 130, ఇరువైపులా కలిపి రూ. 190


* బస్సు, ట్రక్కు (2 యాక్సిల్‌)కు ఒకవైపు రూ. 265, ఇరువైపులా కలిపి రూ. 395గా టోల్ చార్జి నిర్ణయించారు.


* కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా దగ్గర కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 110, ఇరువైపులా కలిపి రూ. 165


* లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మిని బస్సుకు ఒక వైపు రూ. 175, ఇరువైపులా కలిపి రూ. 260


* బస్సు, ట్రక్కు (2 యాక్సిల్‌)కు ఒక వైపు రూ. 360, ఇరువైపులా కలిపి రూ. 540గా నిర్ణయించారు.


* హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారిపై గూడురు టోల్‌ప్లాజా దగ్గర కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 100, ఇరువైపులా కలిపి రూ. 150


* లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సుకు ఒకవైపు రూ. 150, ఇరువైపులా కలిపి రూ. 225


* బస్సు, ట్రక్కు (2 యాక్సిల్‌)కు ఒకవైపు రూ. 305, ఇరువైపులా కలిపి రూ. 460గా నిర్ణయించారు.


* భారీ, అతి భారీ వాహనాల రుసుములు కూడా రూ.20 నుంచి రూ. 35 వరకు పెరిగాయి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM