ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: మంత్రి
 

by Suryaa Desk |

మంచి మెజార్టీతో నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  నిడమనూరులో మంత్రి జగదీష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో, 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసునని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఆకలి చావులపై విజయం సాధించామన్నారు. 2018లోనే జానారెడ్డి ప్రజలచేత తిరస్కరించబడ్డారని తెలిపారు. సీఎం కేసీఆర్ మాకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారన్నారు. చెప్పడానికి ఏమీ లేక జానారెడ్డి ఓటమిని అంగీకరించి ప్రచారానికి పోవద్దని చెబుతున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM