వాట్సాప్ లో ఈ మెసేజ్ మీకూ వచ్చిందా?
 

by Suryaa Desk |

హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాట్సాప్ లో ఓ వార్త అందరిని ఆశ్చర్యంలోకి పడేసింది. నగర పరిధిలో ప్రయాణించే వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకున్నా పర్వాలేదు ఎటువంటి జరిమానా విధించరు అని ఆ మెసేజ్ సారాంశం. దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చౌహాన్‌ అనే న్యాయవాది వేసిన పిటిషన్ పై కోర్టు ఈ నిర్ణయం ప్రకటించిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజమని నమ్మి హెల్మెట్ లేకుండా గనుక మీరు వెళ్తే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఎందుకంటే ఇది పక్కా ఫేక్ న్యూస్. ఈ మెసేజ్ చివరలో ఇచ్చిన ఒక నంబర్‌ కలవగా అది న్యాయవాది దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌దే కావడం గమనార్హం. ఈ నెంబర్ తనదేనని అయితే ఈ మెసేజ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే తన పేరు మీద ఈ వదంతులు సృష్టించారని, దీన్ని ఎవరూ నమ్మొద్దని సూచించాడు. ఇయితే ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ ఫార్వర్డ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM