ఖర్జూర పండ్లతో ఎన్నో ప్రయోజనాలు
 

by Suryaa Desk |

ఖర్జూర పండ్లలో భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలకు బలం చేకూరుస్తాయి. ఖర్జూర పండ్లలో కొలెస్ట్రాల్, చక్కెర తక్కువగా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. శారీరక బలహీనత, లో బీపీ, గుండె జబ్బులు అధిక దాహం వంటి సమస్యలతో పోరాడటానికి ఖర్జూర పండ్లు ఉపయోగపడతాయి. ఖర్జూర పండ్లలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడంతో సాయపడతాయి. ఖర్జూర పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. శరీరంలో తక్కువ స్థాయిలో ఇనుము ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఖర్జూర పండ్లలో అధిక స్థాయిలో ఇనుము ఉంటుంది. శ్వాస సంబంధ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలను కూడా ఎదుర్కొనడంలో కూడా ఖర్జూర పండ్లు బాగా ఉపకరిస్తాయి.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM