చెరువులో పడి బాలుడు మృతి
 

by Suryaa Desk |

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట చెరువు లో పడి యశ్వంత్ (14) అనే బాలుడు మృతి చెందాడు. తన పిల్లవాడు దోశకంటి యశ్వంత్ కనబడుటలేదని‌ నిన్న రాత్రి దుండిగల్ పోలీసులను బాలుడు తండ్రి రాజు ఆశ్రయించాడు. చెరువు గట్టు పైన సైకిల్ ఉందని స్దానికులు 100 డయల్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు చెరువు లో వెతికి యశ్వంత్ మృత దేహాన్ని బుధవారం ఉదయం వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM