తెలంగాణలో జోరుగా వ్యాక్సినేషన్

byసూర్య | Wed, Jan 20, 2021, 02:39 PM

తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 51,997 మందికి టీకాలు వేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ బులెటిన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండోరోజు 18వ తేదీన 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో 69,625 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తాజాగా 51 మందికి రియాక్షన్లు వచ్చాయని, అందులో ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించగా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ విజయవంతంగా అందించినందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని ప్రశంసించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన మరో 3,48,500 కొవిషీల్డ్‌ టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయని తెలిపారు. పుణే నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన టీకాలను కోఠిలోని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌కు తరలించామన్నారు. రెండో దశ పంపిణీ కోసం వాటిని జిల్లాలకు పంపించనున్నట్లు వెల్లడించారు. మొదటి విడత లబ్ధిదారులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50 ఏళ్లు దాటిన వారు, 18-50 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముగిసిన తర్వాత మిగతా రెండు కేటగిరీలకు టీకాలు ఇస్తారు. మార్చి నుంచి 50 ఏళ్లు దాటిన వారికి, 18-50 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకాలు వేస్తామని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.


 


ఇదిలా ఉండగా వ్యాక్సిన్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ రోల్ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందన్నారు. తెలంగాణలో 6106 ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా, వాటిలో సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM