వారంలో ఇంటర్ సిలబస్, పరీక్షల షెడ్యూల్ విడుదల..

byసూర్య | Wed, Jan 20, 2021, 12:52 PM

ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీలు, ప్రాక్టీకల్స్ కు సంబంధించిన అంశాలపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సిలబ సకు అనుగుణంగా ఎంసెట్ పరీక్ష సిలబస్ ఉం టుందని, ఈ విషయంలో మరింతగా చర్చించి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లి దండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యా సంస్థ కార్యా చరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలను ప్రారంభించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు విద్యా సంస్థలు సహకారం అందించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాలవిద్యాకమిషనర్ దేవసేన పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM