ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం..

byసూర్య | Tue, Jan 19, 2021, 10:24 AM

బంధువు అని నమ్మి పనిలో పెట్టుకుంటే.. అతడే ఆ వ్యక్తి పాలిట మృత్యువుగా మారాడు. ఓనర్ భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమెతో కలిసి అతనిని అంతమొందించాడు. ఆ తర్వాత ప్రియురాలితో కలిసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బిహార్‌కు చెందిన లక్ష్మణ్ ఝూ అనే వ్యక్తి ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చాడు. భార్య కుష్బుదేవీ(32), ఇద్దరు పిల్లలతో కలిసి ఖైరతాబాద్‌లోని ఎంఎస్ ముక్తా నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తొలుత సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాడు. ఆ తర్వాత 2019లో ఖైరతాబాద్‌లో జ్యూస్ పాయింట్ ప్రారంభించాడు. జ్యూస్ పాయింట్‌లో పనిచేసేందుకు బిహార్ నుంచి తన బంధువైన లాల్‌బాబును నియమించాడు. అయితే అక్కడ పనికి చేరిన లాల్‌బాబు, కుష్బుదేవీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆరునెలల క్రితం లాల్‌బాబు భార్య మరణించడంతో అతడు బిహార్ వెళ్లాడు. చాలాకాలం పాటు అక్కడే ఉండిపోయాడు. దీంతో లక్ష్మణ్.. లాల్‌బాబును పని నుంచి తొలగించాడు.

ఇక, ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన లాల్‌బాబుఓ హోటల్‌లో పనికి చేరాడు. కుష్బుతో ఫోన్‌లో మాట్లాడుతూ వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. అయితే ఈ విషయం కాస్త లక్ష్మణ్‌కు తెలిపింది. దీంతో అతడు తన భార్యతో పాటు, లాల్‌బాబును హెచ్చరించాడు. అయినప్పటికీ వారిద్దరు వివాహేతర బంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే తమ బంధానికి అడ్డుగా ఉన్న లక్ష్మణ్‌ను అడ్డు తొలగించుకోవాలని బావించారు. అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. జనవరి 14న ప్రియుడు లాల్‌బాబును ఇంటికి పిలిపించిన కుష్బుదేవీ.. అతడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం దానిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.

జనవరి 15వ తేదీ ఉదయం లక్ష్మణ్ సోదరుడి ఫోన్ చేసి.. అతడు నిద్రలోనే మరణించాడని తెలియజేసింది. స్థానికులను కూడా అలానే నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అనుమానంతో లక్ష్మణ్ సోదరుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. లక్ష్మణ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అతని ఒంటిపై గాయాలు ఉండటం, ఊపిరి ఆడకుండా చేసినట్టు తేలింది. దీంతో అతని భార్యను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందుతులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Latest News
 

ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM