కస్టమర్లకు ఎస్బీఐ చెబుతోన్న సెక్యూరిటీ టిప్స్ ఇవే..

byసూర్య | Mon, Jan 18, 2021, 03:45 PM

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల భద్రత కోసం కొన్ని ముఖ్యమైన సెక్యూరిటీ టిప్స్‌ని షేర్ చేసింది. వీటిని గుర్తుపెట్టుకోవడం తేలికే. వీటిని పాటించడం కూడా తేలికే. వీటిని పాటిస్తే మాత్రం మన ఏటీఎం కార్డును ఎవరూ హ్యాక్ చెయ్యలేరు. కార్డుల క్లోనింగ్, స్వాప్ వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. మరి సింపుల్ టిప్స్‌ని తెలుసుకుందాం.
ఏటీఎంకి వెళ్లినప్పుడు పిన్ ఎంటర్ చేసేటప్పుడు ఆ నంబర్లపై తప్పనిసరిగా మీ ఒక చేతిని అడ్డుపెట్టండి. మరో చేత్తో పిన్ ఎంటర్ చెయ్యండి. తద్వారా అక్కడ ఏవైనా సీక్రెట్ కెమెరాలు ఉంటే వాటిలో మీ పిన్ రికార్డ్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో మీ పిన్, కార్డు వివరాల్ని ఎవరికీ చెప్పొద్దు. ముఖ్యంగా కార్డు వెనక ఉండే సీవీవీ నంబర్ అస్సలు చెప్పొద్దు. పిన్ సంఖ్యను ఎట్టి పరిస్థితుల్లో కార్డుపై రాసుకోవద్దు. మీ కార్డు వివరాలు, పిన్ అడుగుతూ ఎవరైనా మెసేజ్, ఈమెయిల్స్, కాల్స్ వంటివి చేస్తే వాటికి స్పందించవద్దు.
మీ పుట్టిన రోజులోని నంబర్లను పిన్ నంబర్లుగా పెట్టుకోవద్దు. ఫోన్ నంబర్లు, అకౌంట్ నంబర్లకు కూడా అలా పెట్టుకోవద్దు. ట్రాన్సాక్షన్ తర్వాత మీకు వచ్చే స్లిప్‌ని మీతో తీసుకెళ్లండి. లేదా దాన్ని చించివేసి డస్ట్‌బిన్‌లో వెయ్యండి. ఏటీఎంలోకి వెళ్ళగానే రహస్య కెమెరాలు ఏవైనా ఉన్నాయేమో గమనించుకోండి. అసలు కీప్యాడ్ పై మరో కీ ప్యాడ్ నకిలీది ఏదైనా ఉందేమో చూసుకోండి. ఏమాత్రం తేడాగా ఉన్నా ట్రాన్సాక్షన్ చేయకుండా సెక్యూరిటీకి చెప్పండి. మీరు ఎప్పుడు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేసుకున్నా మీ మొబైల్‌కి మెసేజ్ వచ్చేలా చేయించుకోండి. తద్వారా పొరపాటున మీ డబ్బు ఎవరైనా విత్ డ్రా చేస్తే వెంటనే మీకు తెలుస్తుంది.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM