కొడుకులే కాడెద్దులు..కన్నీరు పెట్టిస్తున్న రైతన్న కష్టాలు

byసూర్య | Mon, Jan 18, 2021, 01:00 PM

వ్యవసాయాన్నే నమ్ముకుని ఆ కుటుంబం జీవిస్తోంది. లాభమెుచ్చినా..నష్టం వచ్చినా వ్యవసాయం మాత్రం వదలరు కొందరు రైతులు. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతులు మాత్రం తాము నమ్ముకున్న వ్యవసాయానికే పెద్దపీట వేస్తారు. వ్యవసాయం చేస్తూనే ఉంటారు. దుక్కి దున్నేందుకు డబ్బులు లేకపోయినా తమ పిల్లలను కాడెద్దులుగా మార్చి మరీ వ్యవసాయం చేస్తున్న పరిస్థితులు మనం అనేకం చూస్తూన ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలో వెలుగుచూసింది.
కాడెద్దులను కొనలేని ఓ నిరుపేద రైతు తన కన్నకొడుకులనే కాడెద్దులుగా చేశాడు. కొడుకుల చేత గొర్రుతో కరిగెట చేస్తున్నాడు. గుండెలు పిండేసే ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మండలంలోని దోరేపల్లి శివారులో చోటుచేసుకుంది. దోరేపల్లిలో శివగారి పెద్ద రాములు అనే రైతు ఉన్నాడు. అతడికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. అందులో బోరు కూడా ఉంది. ఆ బోరు వేసేందుకు చాలా వరు అప్పులు పాలయ్యాడు. దీంతో సాగు కోసం పాపం కాడెద్దులు కొనలేకపోయాడు.
అయితే నీరు ఎలాగో వచ్చాయి కదా అని పంట సాగు చేయాలనుకున్నాడు. దీంతో విధి లేక కొడుకుల్ని కాడెద్దులుగా చేసి తన కొడుకుల చేత గొర్రును లాగిస్తూ కరిగెట చేయిస్తున్నాడు. రైతు రాములు కష్టం చూసిన స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అతనికి సాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం, అధికారులు నిరుపేద రైతులకే చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM