తెలంగాణ రైతులకు షాక్..

byసూర్య | Sun, Jan 17, 2021, 05:08 PM

తెలంగాణ రైతులకు షాక్. ఈసారి రాష్ట్రంలో రైతులు ఉత్పత్తి చేసిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల మీద కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్‌లో పంటలకు మద్దతు ధర ప్రకటించాల్సి ఉంది. ఇంకా కేంద్రం ప్రకటించలేదు. కాబట్టి, అది ప్రకటించే వరకు ఏ ధరకు కొనాలనే అంశంపై క్లారిటీ లేదు. కాబట్టి, ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రొక్యూర్‌మెంట్ చేయడం లేదు. అదే సమయంలో ప్రైవేట్ వ్యాపారులకు రైతులు పంటలను అమ్ముకునేటప్పుడు వారు నష్టపోకుండా మాత్రం చూడాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. అలాగే, ఎవరైనా రైతులు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్లి విక్రయించాలనుకుంటే వారికి సహకరించాలని కూడా అధికారులకు సూచించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM