పిల్లలను పనికి పంపిస్తే మూడేళ్లు జైలు శిక్ష..!

byసూర్య | Sun, Jan 17, 2021, 04:18 PM

దేశంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. అందులో బాల కార్మిక వ్యవస్థ కూడా ఒకటి. పేదరికం, నిరక్షరాస్యత బాల కార్మిక వ్యవస్థకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల చదువుకోవాల్సిన పిల్లలు పనుల్లోకి వెళ్తున్నారు. అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు.. బాల కార్మిక నిషేద చట్టం వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు..
బాల కార్మిక చట్టం 1986లోని సెక్షన్-3 ప్రకారం బాల, బాలికలతో పనిచేయించడం నేరంగా పరిగణించడం జరుగుతుంది. 18 ఏళ్లలోపు అందరూ బాలల కిందనే పరిగణించడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం పిల్లలతో పనిచేయించిన యజమానులకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఈ చట్టంలోని సెక్షన్-3లోని నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మైనర్‌ను పనులు చేయడానికి నియమించుకుంటే.. ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించడం జరగుతుంది. ఈ శిక్ష రెండేళ్ల వరకూ పొడిగించవచ్చు. దాంతోపాటు 20 వేల నుంచి 50 వేలు రూపాయల వరకూ జరిమానా విధించవచ్చు.
ఈ నేరంలో తల్లిదండ్రులు, సంరక్షకులే పిల్లలను ఏదైనా పనిలో పెడితే సెక్షన్ 3, 3 ఏ ప్రకారం మొదటి నేరమైతే ఎటువంటి శిక్ష విధించరు. మరొకసారి ఇదే నేరానికి పాల్పడితే మాత్రం వారికి పదివేల రూపాయల వరకూ జరిమానాతో పాటు, రెండేళ్ల వరకూ గరిష్ట జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
బాల కార్మిక చట్టం-1986 ప్రకారం ప్రమాదకర పనుల్లో, పరిశ్రమల్లో బాలబాలికలతో పని చేయించకూడదు. దీనిని ఉల్లంఘిస్తే యజమానులకు రూ.10 నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తారు. ఆ మొత్తాన్ని స్థానిక లేబర్‌ అధికారి వసూలు చేసి బాల కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.
తగిన ప్రభుత్వం జిల్లాలకు చైల్డ్ అండ్ కౌమార కార్మిక పునరావాస నిధిని ఏర్పాటు చేస్తోంది. జరిమానాలన్నీ ఆ నిధికి జమ చేయబడతాయి.
రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం బాలలెవరూ కార్మికులుగా పని చేయకూడదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వంతో పాటు స్థానిక పౌర సంఘాలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. తక్షణ కర్తవ్యంగా పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. ఇది కనుక అమలైతే పనిలోకి పిల్లల్ని పెట్టే ప్రక్రియకు అడ్డుకట్ట వేసినట్టవుతుంది
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు రాజకీయ దృఢ సంకల్పంతో పాటు ప్రస్తుత ఉన్న చట్టాలను కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. బాల కార్మిక వ్యవస్థను ఎట్టి పరిస్థితులోనూ అనుమతించకూడదు. దాని నిర్మూలనే ప్రభుత్వాల ప్రాథమిక ధ్యేయం కావాలి.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM