బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపు..

byసూర్య | Sun, Jan 17, 2021, 03:42 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముందగుడు వేశారు. ఈ కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 19కి చేరుకుంది. మరో 9 మంది కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. అలాగే మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరితో పాటుగా మాదాల శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న భూమా అఖిలప్రియ.. ఏ2గా ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ముందుగా అఖిలప్రియపై 448,419,341,342,506,366,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత మరో రెండు సెక్షన్లు (ఐపీసీ 147, 385) జోడించారు. ఈ కేసులో అఖిలప్రియను అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో భాగంగా ఆమెను పోలీసులు మూడు రోజలుపాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. తాజాగా బోయ సంతోష్, మల్లిఖార్జునరెడ్డి, డ్రైవర్ చెన్నయ్యలను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 18న విచారణ జరుపనుంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM