బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Sun, Jan 17, 2021, 01:41 PM

తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు‌పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం అబద్దం చెబుతుందని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై సీఎం కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేస్తే ఆయన పల్లకి మోస్తానని వ్యాఖ్యానించారు.


కరోనా విషయంలో సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. పారాసిట్మల్ ట్యాబ్లెట్ వేసుకోవాలని కేసీఆర్ చెప్పడం ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే కరోనాను అడ్డుకోగలిగామని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడం దారుణమని అన్నారు. కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చాలా చులకనగా చూశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆలస్యం వల్ల పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఎందుకు సమర్పించడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. అగ్రవర్ణాలలోని పేదలకు లబ్దిచేకూర్చే ఈడబ్ల్యూస్ పథకాన్ని రాష్ట్రంలో అమలుకావడం లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ బీజేపీనే ప్రత్యామ్నాయని అన్నారు. బీజేపీ తెలంగాణలో కచ్చితంగా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ‌ఎంసీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి బీజేపీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అటువంటి వేధింపులకు గురయ్యే కార్యకర్తలకు రాష్ట్ర కార్యవర్గం అండగా ఉంటుందని తెలిపారు.


Latest News
 

కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు Tue, Apr 16, 2024, 03:32 PM
స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ Tue, Apr 16, 2024, 02:48 PM
ఎండల నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 02:48 PM
మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM