అనంతగిరి కొండలను కాపాడుకుందాం

byసూర్య | Sun, Jan 17, 2021, 11:56 AM

వాళ్లిద్దరు ఎమ్మెల్యేలు. అయితేనేం.. అనంతగిరి గుట్టల్లో పర్యాటకులు పడేసిన చెత్తను ఏరివేశారు. ప్లాస్టిక్‌ కవర్‌ చేతబట్టి.. చెత్తా చెదారాన్ని జమచేశారు. ప్రకృతి అందాలకు నిలయమైన తెలంగాణ ఊటీ అనంతగిరి కొండలను కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి గుట్టల్లో వాకర్స్‌ అసోసియేషన్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ సంయుక్తంగా నిర్వహించిన ప్లోగతాన్‌-2021 కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలే యాదయ్య సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గుట్టలపై పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని, ప్లాస్టిక్‌ వేస్టేజీని ఏరివేశారు. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు వేస్టేజీని పడవేయకూడదని, అనంతగిరి కొండలను పరిశుభ్రంగా ఉంచుకుందాని సూచించారు. 


Latest News
 

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM