వేములవాడలో చిరుతపులి కలకలం

byసూర్య | Sun, Jan 17, 2021, 10:44 AM

జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో కనిపించిన చిరుత, మళ్లీ ఇవాళ తెల్లవారుజామున వేములవాడ అర్బన్‌ మండలంలోని మారుపాక శివారులో సంచరించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. దీంతో విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, రెండు రోజుల క్రితం మల్కాపూర్‌లోని ఓ వ్యవసాయ బావిలో చిరుతపులి పడిపోయింది. అటవీ అధికారులు వచ్చేలోపే ఆ చిరుత అక్కడి నుంచి తప్పించుకున్నది. మళ్లీ మారుపాక ప్రాంతంలో పులి సంచరిస్తుండటంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.


 


 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM