ఎస్బీఐ అందించే అద్బుతమైన స్కీమ్ ఇదే..

byసూర్య | Sat, Jan 16, 2021, 05:31 PM

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో డిపాజిట్ సర్వీసులు కూడా ఒక భాగమని చెప్పొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ వంటి సేవలు పొందొచ్చు. ఇది రెండే కాకుండా ఎస్‌బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ అనేది కూడా ఒకటుంది. ఎస్‌బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ అనేది ఒకరకమైన రికరింగ్ డిపాజిట్ స్కీమ్. మీరు తక్కువ మొత్తంతోనే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. మీరు మీకు నచ్చినంత మొత్తాన్ని ప్రతి నెలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. రికరింగ్ డిపాజిట్‌లో అయితే ప్రతి నెలా ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి. అంతేకాకుండా నెలకు ఒకసారి మాత్రమే డిపాజిట్ చేయాలనే రూల్ కూడా ఏమీ లేదు.
ఎస్‌బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్‌లో ఎప్పుడైనా ఏ టైమ్‌లో అయిన డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. నెలకు కనీసం రూ.500 డిపాజిట్ చేయొచ్చు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.5,000, గరిష్టంగా రూ.50 వేలు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఎస్‌బీఐ ఫ్లె్క్సీ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే కనీసం ఐదేళ్లు డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి. గరిష్టంగా 7 ఏళ్లు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇకపోతే టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటే ఈ ఫ్లెక్సీ స్కీమ్‌కు కూడా వర్తిస్తుంది. 5.4 శాతం వరకు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 0.5 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. మీ ఫ్లెక్సీ అకౌంట్‌లోని డబ్బుపై 90 శాతం మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM