వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదు : మంత్రి గంగుల కమలాకర్‌

byసూర్య | Sat, Jan 16, 2021, 04:22 PM

కరోనా వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమని.. అపోహలు అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కరోనా టీకా పంపిణీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయం కారణంగానే టీకా తయారీ సాధ్యమైందని అన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వైద్యసిబ్బంది అన్నిజాగ్రత్తలు పాటించాలని సూచించారు.


ప్రక్రియ విజయవంతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల మొదటి టీకా వేయించుకున్నారు. అదేవిధంగా హుజురాబాద్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ ప్రారంభించారు. ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్‌ తొలి టీకా వేయించుకున్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM
ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:24 PM
'తెలంగాణలో లేడీ కేఏ‌ పాల్'.. మాధవీలత చేష్టలపై నెటిజన్ల ట్రోలింగ్ Thu, Apr 25, 2024, 07:18 PM
శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM