బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

byసూర్య | Sat, Jan 16, 2021, 02:35 PM

నేటి యువతలో చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. మనలో చాలా మంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటున్నారు. జిమ్‌ లో గంటల పాటు కుస్తీలు పడకుండా సులభమైన రీతుల్లో మనం బరువును తగ్గించుకోవచ్చు. వ్యూహాత్మకమైన ఆహార ప్రణాళిక, హెల్తీ డైట్ లైఫ్ స్టైల్‌ ను అనుసరిస్తే బరువు తగ్గడమే కాకుండా ఫిట్ గాను ఉంటారు. మరి బరువు తగ్గేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


రోజూ వ్యాయామం చేయాలి..


విరామం ఇవ్వకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఎందుకంటే చెమట చిందిస్తేనే మీరనుకున్నది సాధించగలరు. క్రమశిక్షణగా జిమ్‌ కు వెళ్తూ కసరత్తులు చేయడం ద్వారా క్రమంగా బరువు తగ్గుతారు.


వారానికి సరిపడా డైట్ ఛార్ట్ పెట్టుకోవాలి..


పోషకాలుండే ఆహారమేంటో పక్కాగా వారానికి సరిపడా ఛార్ట్‌ను తయారు చేసుకోవాలి. అందుకు సరిపడా ముడి సరుకులను వారానికి సరిపడా తెచ్చుకుంటే మంచిది.


కోరికను నియంత్రించుకోవాలి..


జంక్ ఫుడ్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినే సమయంలో కొంచెం కోరికలు కంట్రోల్ చేసుకోండి.


మీకు మీరు బహుమతి ఇచ్చుకోవాలి..


మీరు ఏదైనా కోరుకుంటే దాన్ని మీకు మీరు బహుమతిగా ఇచ్చుకోండి. మీ శరీరంలో బరువు తగ్గినట్లు మీకు అనిపించినపుడు మాత్రమే అలా చేయండి. అప్పుడే మీకు ప్రేరణ కలుగుతుంది.


రాత్రి త్వరగా తినండి..


రాత్రుళ్లు త్వరగా తినమని, త్వరగా నిద్రించాలని ఎంతో మంది నిపుణులు చెబుతారు. అవును డిన్నర్‌ ను త్వరగా పూర్తి చేస్తే జీర్ణం త్వరగా అవుతుంది. అంతేకాకుండా రాత్రుళ్లు మంచి నిద్ర కూడా పడుతుంది.


ఉదయాన్నే ఇలా చేయండి: ఉదయాన్నే చేయాల్సిన మొదటి పని వేడి నీటిలో నిమ్మరసం కలిపి ఆ ద్రావణాన్ని తాగడం అలరవర్చుకోండి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉంటే మంచిది.


జంక్ ఫుడ్స్‌కు చెక్ పెట్టండి..


కొవ్వు పదార్థాలను కలిగి ఉండే అన్ని రకాల చిప్స్, ఉడికించకుండా తక్షణంగా తయారు చేసే ఫుడ్స్‌ను తీసుకోకూడదు. వీటిని పూర్తిగా దూరంగా ఉంచండి. వాటిని తినాలని కోరిక పుట్టేముందు వాటిని విసిరి పారేయండి.


చిన్నగా నమిలి తినండి..


ఆరోగ్యకరమైన పోషకాలుండే ఆహారాన్ని తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటే మంచిది. వేగంగా తినడం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మీ కడుపు కోరుకున్న దానికన్నా ఎక్కువ తినడాన్ని ముగించాలి.


వాటర్ థెరపీ..


నీటిని ఎక్కువగా తీసుకోవాలి. వేగంగా బరువు తగ్గాలనుకుంటే రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. అంతేకాకుండా ఆహారం తక్కువ తీసుకునేలా ఉపయోగపడుతుంది.


గ్రీన్ టీ తాగాలి..


కాఫీ, టీలు తాగే బదులు గ్రీన్ టీని తాగడం ఎంతో ఉత్తమం. రోజుకు రెండు కప్పులు కెఫైన్ అధికంగా ఉండే కాఫీ కంటే హెర్బల్ టీ, గ్రీన్ టీ, స్పైసెడ్ టీ లేదా దేశీ కధాను తాగడం మంచిది.


క్రమంగా ఆకలి నియంత్రించుకోవచ్చు..


రోజూ క్రమం తప్పుకుండా మితంగా తినడం ప్రారంభించడం వల్ల కొన్ని రోజులకు ప్లేట్ భోజనానికే కడుపు నిండిన భావం కలుగుతుంది. కాబట్టి క్రమంగా ఆకలిని నియంత్రించుకోవచ్చు.


ఆకలి మాట వినొద్దు..


తినేటప్పుడు టీవీ చూడటం, స్మార్ట్ ఫోన్ వాడటం, ల్యాప్ ట్యాప్ ఆపరేట్ చేయడం లాంటి వాటిని అస్సలు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా అతిగా తినే ప్రమాదముంది. కాబట్టి వీటిని దూరం పెట్టి శ్రద్ధగా ఆహారాన్ని ఆస్వాదించండి.


వండటం ప్రారంభించాలి..


ఎక్కువ సమయం కిచె‌న్ లో గడపడం ద్వారా ఆహారం గురించి తెలుసుకుంటారు. అంతేకాకండా రుచితో పాటు ఆరోగ్యకరమైన భోజనాన్ని ఎలా తీసుకోవాలో మీకు తెలుస్తుంది.


డెజర్ట్ స్థానంలో పండ్లు తీసుకోండి..


ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడమే కాదు మీ ప్లేట్‌లో పండ్లతో తయారు చేసిన శాండ్ విచ్ లేదా సలాడ్‌ను జత చేయండి. స్వీట్ స్థానంలో పండ్లను ఆహారంగా తీసుకోండి.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM