త్వరలో టీఆర్ఎస్‌లో భారీ మార్పులు..?

byసూర్య | Sat, Jan 16, 2021, 01:42 PM

త్వరలోనే టీఆర్ఎస్‌లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేటీఆర్ సీఎం పదవిని అధిష్టించనున్నట్టు పార్టీలోనే జోరుగా చర్చ సాగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోన్న కేటీఆర్ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది.
మంత్రిగా ఆయన ఇప్పటికే నిరూపించుకోవడంతో ఇక కేసీఆర్ ఆయనకు సీఎం పీఠం అప్పగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో కేసీఆర్ కంటే కేటీఆర్‌నే ఎక్కువగా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ అంశం కూడా కేటీఆర్ సీఎం అవుతారనే వాదనను బలపరుస్తుంది. ఈ మధ్య చాలామంది సీనియర్ నేతలు సైతం కేటీఆర్ త్వరలో రాష్ట్రానికి సీఎం అవుతారని చెబుతున్నారు. అందులో భాగంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అతి త్వరలోనే కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారనే వార్త కూడా హల్‌చల్ చేస్తోంది.
ఒక వేళ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మరి కేసీఆర్ పరిస్థితి ఏంటనేది ప్రశ్న.. చాలామందిని వేధిస్తోంది. వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేసీఆర్.. రాష్ట్రంలో బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించి.. పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి కేంద్ర స్థాయిలో రాజకీయాలవైపు అడుగులు వేయాలనుకున్నారు. అయితే అది సాధ్యపడలేదు.
దాంతో ఇప్పుడు కేటీఆర్ సీఎం అయితే... కేసీఆర్ సూపర్ సీఎం స్థానంలో ఉంటారని ప్రగతి భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఇక సూపర్ సీఎం టీమ్‌లో లేదా సలహా మండలిలో ఛైర్మెన్‌గా కేసీఆర్, కొత్త సీఎం కేటీఆర్, ఇతర మంత్రులతో పాటు మరికొందరు ముఖ్యులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏదైనా అంశంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ అంశం ఈ సలహామండలి వద్దకు ముందుగా వెళ్తుంది. అక్కడ చర్చించిన తర్వాతే దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సలహామండలికి ఛైర్‌పర్సన్‌గా కేసీఆర్‌ ఉంటారు కనుక ఆయన అభీష్టంమేరకే నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఇలా పెద్ద పాత్రలో ఉండనున్నట్టు సమాచారం.
కేటీఆర్ కూడా మంత్రిగా తన ప్రతిభను, శక్తిసామర్థ్యాలను నిరూపించుకుని.. రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ అనుభవంతో ఆయనకు సీఎం పదవిని కట్టబెట్టేందుకు అడుగులు పడుతున్నాయి. అయితే అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం అలాంటిదేమి ఉండదని కొట్టి పారేస్తున్నాయి. మరీ కేటీఆర్‌ సీఎం అవుతారా..? లేదా..? అన్న విషయం చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM