ఈ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే అనారోగ్య సమస్యలన్నీ దూరం

byసూర్య | Fri, Jan 15, 2021, 05:33 PM

మంచి హెల్త్‌కి విటమిన్ డీ ఎంత అవసరమో మనకి తెలుసు. ఇమ్యూనిటీ బూస్టర్ మాత్రమే కాదు, విటమిన్ డీ బోన్స్, మజిల్ స్ట్రెంత్ కి కూడా ఎంతో అవసరం. విటమిన్ డీ మనక సూర్య కాంతి నుండి లభిస్తుంది. అందుకే దీన్ని సరదాగా సన్ షైన్ విటమిన్ అని కూడా అంటారు. కానీ, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల చాలా మందికి ఈ విటమిన్ అందడం లేదు. పైగా, ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ నేపధ్యం లో ఇంట్లోనుండి అసలు కాలు బయటకి పెట్టకుండా ఉండడం వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువవుతోంది. ఇంట్లోనే ఉంటే విటమిన్ డీ అందదు. ఫలితంగా, మన ఇమ్యూనిటీ కూడా వీక్ అయిపోతోంది. రీసెంట్ గా జరిగిన ఒక స్టడీ ప్రకారం విటమిన్ డీ సరిపోయినంత ఉంటే వారికి కొవిడ్ సోకినా ట్రీట్మెంట్ లో హెల్ప్ చేస్తుందని తెలుస్తోంది. సూర్య కాంతి కాకపోతే విటమిన్ డీ ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీని కూడా పెంచుకోగలుగుతాం.
ఊతప్పం: ఊతప్పం అందరికీ తెలిసిందే. సౌత్ ఇండియా లో దీనికి పరిచయం అవసరం లేదు. ఈ ఊతప్పానికి మష్రూంస్ యాడ్ చేశారంటే విటమిన్ డీ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ ని మీరు ఎంజాయ్ చేసినట్లే.
ఎగ్ పరాఠా: కడుపు నిండుగా మనసు నిండుగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ఇది. ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ లో పరాఠాది ప్రత్యేకమైన స్థానం. దానికి ఎగ్ జోడించండి, డీ విటమిన్ మరియు ప్రోటీన్స్ తో కూడిన ఫుడ్ తో మీ రోజుని మొదలుపెట్టండి.
లస్సీ: ఇది పంజాబ్ లో పుట్టినా ఇండియా అంతా దీనికి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మీ పరాఠా తో పాటూ లస్సీ తాగండి. పొట్టలో చల్లగా హాయిగా ఉంటుంది.
ఫిష్ కట్లెట్: ఫిష్, బంగాళాదుంపలతో చేసిన ఈ కట్లెట్ ని పొద్దున్నే ఆస్వాదించండి. మీకు కావాల్సిన డీ విటమిన్ మీకు అందినట్లే.
దలియా: సింపుల్ గా అయిపోయే, కడుపు నిండుగా అనిపించే బ్రేక్ ఫాస్ట్ ఇది. ఆవు పాలు, ఆల్మండ్ మిల్క్, సాయ్ మిల్క్ - వీటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. గోధుమ రవ్వని ఈ పాలలో ఉడకబెట్టి మీకు నచ్హిన స్వీటనర్ యాడ్ చేసి, మీకు కావాల్సిన నట్స్ తో గార్నిష్ చేసి ఎంజాయ్ చేయండి.
ఓట్స్ ఇడ్లీ: ఇడ్లీ అందరికీ తెలిసిన, తేలికగా అరిగిపోయే, డైజెషన్-ఫ్రెండ్లీ బ్రేక్ ఫాస్ట్. ఇడ్లీ పిండికి ఓట్స్ యాడ్ చేయండి. తేలికగా ఉంటుంది, న్యూట్రియెంట్ వాల్యూ కూడా ఎక్కువే.
పనీర్ చీలా: పన్నీర్ నుండి మీకు కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్ డీ - అన్నీ లభిస్తాయి. ఈ చీలా ని బ్రేక్ ఫాస్ట్ గా ఎంజాయ్ చేయండి. సన్ షైన్ అంత హ్యాపీ గా ఉండండి.
విటమిన్ డీ సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే సూర్య కాంతి ద్వారా విటమిన్ డీ పొందడం మేలు. అది కుదరనప్పుడు ఫుడ్ ద్వారా ఈ విటమిన్ ని తీసుకోండి. ఈ ఈజీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీస్ మీకు కావాల్సిన వెరైటీ ని కూడా అందిస్తాయి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM