మటన్ కు భారీ డిమాండ్...షాపుల దగ్గర రద్దీ

byసూర్య | Fri, Jan 15, 2021, 11:37 AM

తెలుగు ప్రజలు కనుమ పండుగను జరుపుకుంటున్నారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు.. ముక్క లేనిదే ముద్దదిగదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. నాటు కోడితో పాటు మటన్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ఏటా సంకాంత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజైన కనుమ రోజున నాన్ వెజ్ తినడం అనవాయితీ. ఈ ఏడాది కూడా నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కట్టారు.


కనుమ రోజు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు.. అందులోకి నాటుకోడితోపాటు వివిధ రకాల మాంసాహారాలు తీసుకుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజులూ మూడు ప్రత్యేకతలు సంతరించుకుంది. తొలిరోజు భోగి మంటలు వేసి పిండి వంటలు చేసుకుని పిల్లలు ఆనందంగా గడుపుతారు. రెండో రోజున తమ పూర్వీకులకు పితృతర్పణాలు ఇచ్చే కార్యక్రమాలు పెద్దలు పెట్టుకుంటారు. మూడో రోజు పూర్తిగా మాంసాహారం సంక్రాంతిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో బాగంగా ఇవాళ కనుమ కావడంతో ప్రజలు మాంసాహారం షాపుల ముందు క్యూకట్టారు.


కనుమ పండగ రోజు తప్పనిసరిగా నాన్ వెజ్ వండుకుంటారు తెలుగు ప్రజలు. సాధారణంగా కోడికూరకే పెద్ద పీట వేస్తారు. అయితే, ఈ ఏడాది బర్డ్ ఫ్లూ టెన్షన్ పుట్టిస్తోంది. కోళ్లు, కోడి గుడ్డు ద్వారా కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుందని పుకార్లు రావడంతో... నాన్ వెజ్ ప్రియులు కోడి కంటే మటన్, చేపల వైపు మొగ్గచూపుతున్నారు. మటన్ ధర ఎక్కువయినా సరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు


 


 


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM