జ‌న‌వ‌రి 29 నుంచి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు

byసూర్య | Fri, Jan 15, 2021, 10:13 AM

పార్ల‌మెంట్ బడ్జెట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంది. జనవరి 29 నుంచి స‌మావేశాలు మొద‌లుకానున్నాయి. ఇక‌ ఫిబ్రవరి 1న 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. ఈ మేర‌కు లోక్‌సభ సచివాలయం ప్రకటన చేసింది. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన 14 రోజుల విరామం అనంత‌రం.. తిరిగి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 వరకు..20 రోజుల పాటు స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఆ త‌ర్వాత‌ ఏప్రిల్‌ 8తో ముగిసే అవకాశం ఉంద‌ని కేంద్రం తెలిపింది.


తొలి రోజు ఉదయం 11గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ త‌ర్వాత ఎకనమిక్‌ సర్వేను విడుదల చేస్తారు. సెప్టెంబర్‌లో వర్షాకాల సమావేశాల తర్వాత..పార్లమెంట్‌ ఉభయ సభలు భేటీ కావడం మ‌ళ్లీ ఇదే. నాటి స‌మావేశాలల్లో వ‌రుస‌గా ఎంపీలు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ‌టంతో.. ఉభయ సభలను నిరవధికంగా వాయిదావేశారు. కాగా క‌రోనా కార‌ణంగా శీతాకాల సమావేశాలు కూడా నిర్వహించలేదు.


Latest News
 

కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు Tue, Apr 23, 2024, 11:55 AM
పిట్లంలో హనుమాన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 11:54 AM
స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం Tue, Apr 23, 2024, 11:52 AM
తొమ్మిది నామినేషన్లు దాఖలు Tue, Apr 23, 2024, 11:50 AM
అకాల వర్షంతో అతలాకుతలం.. Tue, Apr 23, 2024, 11:45 AM