అఖిలప్రియ కేసులో కీలక మలుపు..

byసూర్య | Wed, Jan 13, 2021, 11:40 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఏ-1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం భూమా అఖిల ప్రియ పోలీసుల కస్టడీలో ఉన్నారు. పోలీస్ కస్టడీలో విచారణలో భాగంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం సినిమా తరహాలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రియ గ్యాంగ్ స్కెచ్ వేసినట్లు తేలింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'స్పెషల్ చబ్బీస్' చిత్రంలో సీన్లను చూసి అమలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కిడ్నాప్ ఎలా చేయాలని అన్న దానిపై గ్యాంగ్‌కు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్పెషల్ చబ్బీస్ సినిమా సీన్లను చూపించి.. కిడ్నాప్ ఎలా చేయాలి.? ఐటీ అధికారులుగా ఎలా నటించాలి.? వారిని ఎలా నమ్మించాలి.? అని రిహార్సల్స్ కూడా చేయించాడు. కిడ్నాప్‌కు సంబంధించి యూసుఫ్‌గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్ క్లాస్‌ కూడా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడే స్పెషల్ చబ్బీస్ మూవీ సీన్లను తమ గ్యాంగ్ సభ్యులకు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు చంద్రహాస్ చూపించారని తెలుస్తోంది.
ఐటీ అధికారుల్లా కనిపించేందుకు.. కాస్ట్యూమ్స్, ఐడీ కార్డులు సిద్ధం చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఓ సినిమా కంపెనీ నుంచి ఐటీ అధికారుల డ్రెస్సులను అద్దెకు తీసుకున్నాడు. అంతా ఓకే అనుకున్నాకే.. ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అంతలోనే అడ్డంగా దొరికిపోయారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM