ఆ జిల్లాలో ఏడుగురు ఆత్మహత్య..

byసూర్య | Tue, Jan 12, 2021, 02:28 PM

సంగారెడ్డి జిల్లాలో ఒకే రోజు ఏడు మంది వివిధ రకాలుగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించి మోసం చేశాడంటూ డిగ్రీ చదువుతున్న శ్రావణి విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పటాన్‌చెరువు మండలం లక్డారం గ్రామంలో అమ్మమ్మ వద్ద నివాసం ఉంటున్న శ్రావణి.. ప్రేమించిన వాడు మోసం చేశాడని మనస్థాపానికి గురై ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక సంగారెడ్డి మండలం పసల్‌వాది గ్రామంలో దర్జీ రమేష్ గత కొన్ని రోజుల నుండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. లారీడ్రైవర్‌గా పని చేసిన రమేష్.. కరోనా ప్రభావంతో లారీలు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక జిల్లాలోని కల్హేర్ మండలం రాపర్తి గ్రామ శివారులో నారాయణఖేడ్ పట్టణానికి చెందిన చాకలి దుర్గయ్య అనే యువకుడు అనుమానాస్పద రీతిలో చనిపోయాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల.. విచారణ చేపట్టారు. ఇక పటాన్‌చెరువు అన్నపూర్ణ హోటల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని 20 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో యువకుడిని ఢీ కొట్టిన వాహనం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మునిపల్లి మండల కేంద్రంలో లారీ క్లియర్‌గా పని చేస్తున్న యువకుడు లారీ తూడుస్తు ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వెనుక టైర్ కిందపడి చనిపోయాడు. కల్హేర్ మండల కేంద్రంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో న్యాయవాది అక్కడికక్కడే మృతి చెందాడు. మరో పది నిమిషాలలో ఇంటికి చేరుకునే సమయంలో ని ఈ సంఘటన జరగడం న్యాయవాది కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కంది మండలం కేంద్రంలో ఆటో లారీ ఢీకొనడంతో కూలి మృతిచెందిన ఘటన గ్రామ శివారులో జరిగింది. ఇక గ్రానైట్ షాపులో పని చేస్తున్న శివ అనే యువకుడు ఆటోలో వెళుతుండగా.. వెనుక నుంచి లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సంగారెడ్డి జిల్లాలో ఓకే రోజు ఏడుగురు వివిధ రకాలుగా చనిపోవడం పోలీస్ యంత్రాంగం వివిధ కోణంలో దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM