భారీగా తగ్గిన బంగారం ధర

byసూర్య | Mon, Jan 11, 2021, 02:34 PM

నూతన సంవత్సరంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో ధరలు తగ్గిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,300 మేర దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ.50,500కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 వద్ద మార్కెట్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు బంగారం ధర పతనమైంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,310 మేర భారీగా తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.52,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గడంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.48,450 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.6,000 మేర భారీగా తగ్గింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.63,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.5,500 మేర భారీగా తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.69,000కు పతనమైంది.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM