వికారాబాద్ జిల్లాలో కల్తీకల్లుకు మరొకరు బలి

byసూర్య | Mon, Jan 11, 2021, 11:40 AM

వికారాబాద్ జిల్లాలో కల్తీకల్లుకు మరొకరు బలయ్యారు. నవాబుపేట మండలం వట్టిమినేనిపల్లికి చెందిన కొమురయ్య.. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో క‌ల్తీ క‌ల్లు మృతుల సంఖ్య‌ రెండుకు చేరింది.వికారాబాద్ జిల్లాలో క‌ల్తీ కల్లు కల్లోలం రేపింది. డిపోలో అమ్ముతున్న కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికావడంతోపాటు నిన్న ఒకరు మృతి చెందడం కలకలం సృష్టించింది. రోజంత కష్టపడి ఉపసమనం కోసం డిపోకు వెళ్లి కల్లు తాగుదామనుకునేవారికి ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. రోజూ తాము తాగే కల్లు కల్తీదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నవాబుపేట మండలంలో 102 మంది అస్తస్థతకు గురయ్యారు. ఈ రెండు మండలాల్లోని 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కల్లు సరఫరా అవుతుంది. 11 గ్రామాల్లో 212 మంది అస్వస్థతకు గురయ్యారు.


 


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM