రాష్ర్టంలో పెరుగనున్న చలి తీవ్రత

byసూర్య | Mon, Jan 11, 2021, 09:46 AM

హైదరాబాద్ : రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలుల జోరు పెరుగుతున్నది. దీంతో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా అర్లి (టి), కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలలో అత్యల్పంగా 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ బోథ్‌, తాంసి, గుడిహత్నూర్‌, నేరేడిగొండ, నిర్మల్‌ జిల్లా కుభీర్‌, ములుగు జిల్లా గోవిందరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపల్లి, సంగారెడ్డి జిల్లా కోహిర్‌, మంచిర్యాల జిల్లా జన్నారంలో 12.5 నుంచి 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. కానీ, మంగళవారం లేదా బుధవారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గవచ్చని వివరించారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM