నేత్రపర్వంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

byసూర్య | Sun, Jan 10, 2021, 11:50 AM

హైదరాబాద్‌ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు కల్యాణం జరుగడం ఆనవాయితీగా వస్తోంది. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం మల్లికార్జున స్వామి, మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహ వేడుకను పండితులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా బార్సి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో క్రతువు ప్రారంభమైంది. వివాహోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వం తరఫున స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి,  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు వివాహ వేడుకకు హాజరయ్యారు. మలన్న కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్‌శాఖ సైతం 260 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 14 మంది ఎస్సైలు, 30 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 150 మంది కానిస్టేబుళ్లు, 31 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోం గార్డులు 31, బీడీ టీమ్స్‌తో పాటు రోప్‌ పార్టీల ఏర్పాటు చేశారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM