దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం

byసూర్య | Sun, Jan 10, 2021, 10:57 AM

హైదరాబాద్ : దేశంలో దాదాపు రెండు దశాబ్దాల తరువాత పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింది. గత సంవత్సరం కుదేలు చేసిన కరోనా మహమ్మారి కారణంగానే ఇది సంభవమైంది. లాక్ డౌన్ వల్ల వాహనాలు కొన్ని నెలల పాటు రోడెక్కలేదన్న విషయం తెలిసింది. ఇక చమురు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రాధమిక గణాంకాల బట్టి, 2019తో పోలిస్తే, పెట్రోలియం డిమాండ్ 10.8 శాతం తగ్గింది. కేవలం 193.4 మిలియన్ టన్నుల ఇంధనం మాత్రమే వినియోగమైంది. ప్రపంచంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ను వినియోగిస్తున్న దేశాల్లో ఒకటైన ఇండియాలో 1999 తరువాత ఇంత తక్కువ ఇంధనాన్ని వాడటాన్ని ఇదే తొలిసారి. మార్చి తరువాత ఇంధన వినియోగం 70 శాతం తగ్గింది. పెట్రోకెమికల్ ప్లాంట్లలో సైతం క్రూడాయిల్ శుద్ధి కార్యకలాపాలు కొంత కాలం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా... అంటే డిసెంబర్ లో సైతం గత సంవత్సరంతో పోలిస్తే ఇంధన డిమాండ్ 1.8 శాతం తగ్గడం గమనార్హం.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM