బర్డ్‌ ఫ్లూ తెలంగాణలో లేదు: మంత్రి ఈటల

byసూర్య | Sat, Jan 09, 2021, 02:41 PM

హైదరాబాద్‌:తెలంగాణలో ఎక్కడా ‘బర్డ్‌ ఫ్లూ’ వైరస్‌కు  సంబంధించిన ఆనవాళ్లు లేవని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.  బర్డ్‌ ఫ్లూతో మన రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు.   తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. నిమ్స్‌లో ఆధునీకరించిన అంకాలజీ డిపార్ట్‌మెంట్‌ను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌, ఎంఐఈఎల్‌ అధ్యక్షుడు పీపీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


'ఈహెచ్‌ఎస్‌, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200కోట్లు ఖర్చు చేస్తున్నాం. అదనంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నిధులు కేటాయిస్తున్నాం.  రూ.7,500 కోట్లు వైద్యరంగంపై ఖర్చు చేస్తున్నాం. రూ.450కోట్లతో నిమ్స్‌లో సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం.  వైద్యరంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని' పేర్కొన్నారు. 


'రాష్ట్రంలో రెండోదశ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతం అయింది. కేంద్రం ఎప్పుడు వ్యాక్సిన్‌ పంపినా వాక్సినేషన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.  రోజుకు 10లక్షలు మందికి వాక్సిన్‌ ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. వాక్సినేషన్‌ కార్యక్రమం రెండు ఆస్పత్రుల్లో ఉంటుంది.  తొలి వ్యాక్సిన్‌ నేనే వేయించుకుంటాను. కొత్త స్ట్రెయిన్‌కు భయపడాల్సిన పనిలేదని' మంత్రి వివరించారు. 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM