తెలంగాణ వ్యాప్తంగా వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌
 

by Suryaa Desk |

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈమేరకు వాతావరణ విభాగం అధికారి రాజారావు సోమవారం హెచ్చరిక జారీచేశారు. ప్రధానంగా దక్షిణ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, పాలమూరు, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ నుండి అతి భారీవర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాకా.. సోమవారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. భారీవర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలే ప్రమాదం ఉందన్నారు.

Latest News
తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు Thu, Nov 26, 2020, 05:33 PM
టీఆర్ఎస్ పాలనలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది: కేటీఆర్ Thu, Nov 26, 2020, 05:12 PM
బీజేపీ పై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ Thu, Nov 26, 2020, 04:32 PM
బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టో విడుదల Thu, Nov 26, 2020, 03:59 PM
ఆ పార్టీలను ఓటర్లు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు: రేవంత్ రెడ్డి Thu, Nov 26, 2020, 03:28 PM