హైదరాబాద్ నగరాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన తమిళనాడు
 

by Suryaa Desk |

వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగరాన్ని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరద సాయంగా రూ.10 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిసామి ఓ లేఖ రాశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని, పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు ప్రజల తరఫున సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్లు ప్రకటిస్తున్నట్టు లేఖలో తెలిపారు. అంతేగాక దుప్పట్లు తదితర సామాగ్రి కూడా అందించనున్నట్టు తెలిపారు. వరదల్లో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  


Latest News
హుజురాబాద్‌లో నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం Wed, Oct 27, 2021, 11:03 AM
మంత్రిహరీశ్ రావుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు Wed, Oct 27, 2021, 10:54 AM
ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Wed, Oct 27, 2021, 10:50 AM
నేడు తెలంగాణ రాష్ట్ర బంద్! Wed, Oct 27, 2021, 09:29 AM
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం Wed, Oct 27, 2021, 09:29 AM