టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
 

by Suryaa Desk |

కాంగ్రెస్ నేతలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు. పాలమూరు దరిద్రానికి కారణం కాంగ్రెస్ కాదా? పాలమూరు ప్రజలు తాగునీటికి కూడా కటకటలాడటానికి కాంగ్రెస్ కారణం కాదా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే.. జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తే వారే అప్రతిష్టపాలవుతారు. ఎల్లూరు పంపుల మునక సాంకేతిక లోపమే అయ్యుండొచ్చు. బీఎచ్ఈఎల్ పంపులు బిగించాము. ఒకప్పుడు ఈ ప్రాంతాలను చూపించి అప్పులు తెచ్చుకున్న ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి ఏమీ ఒరగబెట్టారు. దేశంలోనే అత్యధిక వరి దిగుబడి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ మార్చారు’ అని మంత్రి తెలిపారు.


Latest News
తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు Thu, Nov 26, 2020, 05:33 PM
టీఆర్ఎస్ పాలనలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది: కేటీఆర్ Thu, Nov 26, 2020, 05:12 PM
బీజేపీ పై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ Thu, Nov 26, 2020, 04:32 PM
బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టో విడుదల Thu, Nov 26, 2020, 03:59 PM
ఆ పార్టీలను ఓటర్లు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు: రేవంత్ రెడ్డి Thu, Nov 26, 2020, 03:28 PM