చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎల్.రమణ
 

by Suryaa Desk |

మరోసారి టీటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్.రమణను పార్టీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండోసారి అవకాశం ఇచ్చినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. తడిసిన ధాన్యం, పత్తిని ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి.. ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. నష్టపోయిన వాళ్లకు ఎకరాకు 25 వేల సాయం చెయ్యాలన్నారు. హైదరాబాద్ రహాదారులు చెరువులను తలపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోక పోతే, ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని రమణ హెచ్చరించారు. 


Latest News
తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు Thu, Nov 26, 2020, 05:33 PM
టీఆర్ఎస్ పాలనలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది: కేటీఆర్ Thu, Nov 26, 2020, 05:12 PM
బీజేపీ పై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ Thu, Nov 26, 2020, 04:32 PM
బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టో విడుదల Thu, Nov 26, 2020, 03:59 PM
ఆ పార్టీలను ఓటర్లు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు: రేవంత్ రెడ్డి Thu, Nov 26, 2020, 03:28 PM