హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం దంచికొడుతోంది

byసూర్య | Mon, Oct 19, 2020, 01:10 PM

హైదరాబాద్‌లోని  మల్కాజిగిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, చార్మినార్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అలాగే, సుల్తాన్ బజార్, కోఠి, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కీసర, చాంద్రాయణ గుట్ట, ఫలక్ నుమా, ఉప్పుగూడ, శివాజీ నగర్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది.


మరో రెండు రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.  లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల తరలింపునకు జీహెచ్‌ఎంసీ చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు వందలాది కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగిస్తూనే బాధితులకు జీహెచ్ఎంసీ పునరావాసం కల్పిస్తోంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM