ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు : హరీష్ రావు

byసూర్య | Mon, Oct 19, 2020, 01:02 PM

సామాజిక మాధ్యమాల్లో బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తోన్న వారిని అరెస్టు చేశారని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ..  ప్రతిపక్ష నేతలు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.


తెలంగాణలో బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛనులో రూ.1,600 ప్రధాని మోదీ ఇస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారని హరీశ్ రావు అన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చే పింఛనులో 16 పైసలు కూడా మోదీ ఇవ్వట్లేదని ఆయన చెప్పారు. మోదీ డబ్బులు ఇస్తున్నట్లు నిరూపిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.


బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వట్లేదని హరీశ్ రావు వివరించారు. దుబ్బాక నుంచి బండి సంజయ్‌కు సవాలు విసురుతున్నానని, దుబ్బాక ప్రజల మధ్య బహిరంగ చర్చకు రావాలని ఆయన అన్నారు.


తెలంగాణలో కేసీఆర్ కిట్ గురించి కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కేసీఆర్ కిట్ అందిస్తున్నామని వివరించారు. అబద్ధాల పునాదుల మీద కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటి వారు రేపు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.


అబద్ధాల మీదే ఆధారపడి ఓట్లు సంపాదించుకుంటామంటే ఈ దుబ్బాక గడ్డ మీద నడవదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కరపత్రాల ద్వాారనూ అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అసత్యాలు ప్రచారం చేశారు కాబట్టే హుజూర్ నగర్‌లో బీజేపీకి నాలుగో స్థానం వచ్చిందని, దుబ్బాక ప్రజలు కూడా బీజేపీకి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.


ఎప్పుడైనా అంతిమంగా ధర్మినిదే విజయమని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగామని, రాష్ట్ర బీజేపీ నేతలు సమర్థులైతే అది తీసుకురావాలని ఆయన సవాలు విసిరారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM