వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు

byసూర్య | Sun, Oct 18, 2020, 01:00 PM

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సహాయక చర్యలను జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. కాలనీలు, సెల్లార్లలో నిలిచిన నీటిని పంపులతో డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు పంపింగ్ చేస్తున్నారు. అంతేకాదు రోడ్లపై నిలిచిన నీటిని  జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తోంది. వరదతో రోడ్లు, నాలాల్లోకి కొట్టుకొచ్చిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. శనివారం రాత్రి రికార్డు స్థాయిలో కురిసిన వాన పలు ప్రాంతాల్లో నగరవాసులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన కొందరు విగత జీవులుగా మారగా.. చెరువుల్లా మారిన నివాసాలతో పలు కాలనీలు, బస్తీల్లో ప్రజలు కట్టుబట్టలతో బయటకు వచ్చారు. సకాలంలో సహాయక చర్యలు అందించడంతో జీహెచ్‌ఎంసీ విఫలమైందని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Latest News
 

ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM
యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ Thu, Apr 18, 2024, 08:58 PM
సౌత్ సెంట్రల్ రైల్వేకు రికార్డు ఆదాయం.. జోన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం Thu, Apr 18, 2024, 08:55 PM