పంట నష్టోపయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి : జగ్గారెడ్డి

byసూర్య | Sun, Oct 18, 2020, 11:42 AM

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులకు, కుంటలకు గండ్లు పడ్డాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలంలో మల్లేపల్లి గ్రామం చెరువు కట్ట తెగింది. దీంతో మల్లేపల్లి-గోపులారం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువు కట్ట తెగడంతో దాదాపుగా రెండు వందల ఎకరాలలో పంట నీట మునిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం కొండాపూర్‎లో పర్యటించి గ్రామస్తులను, రైతులను పరామర్శించారు. పంట నష్టోపయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు కట్ట పునర్నిర్మాణ పనులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM