భాగ్యనగర ప్రయాణికులకు శుభవార్త మెట్రో ఎండీ

byసూర్య | Fri, Oct 16, 2020, 06:49 PM

భాగ్యనగర ప్రయాణికులకు మెట్రో ఎండీ శుభవార్త చెప్పారు. దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని  ఆ సంస్థ రాయితీలు ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఓ వైపు కరోనా, మరో వైపు వరదలతో నగరవాసులు అల్లాడుతున్న తరుణంలో రాయితీలు ప్రకటించడం ఇదొక శుభపరిణామమే. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు మెట్రో ప్రయాణికులకు ఆఫర్ వర్తించనుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. 


ప్రయాణికుల భద్రత విషయంలో మెట్రో ముందుంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షం పడ్డ రోజు గర్భిణి కోసం ప్రత్యేకంగా మెట్రో రైలు నడిపినట్లు తెలిపారు. విక్టోరియల్ స్టేషన్ నుంచి మియాపూర్‌ మెట్రో రైలు నడిపి ఆ మహిళను ఇంటికి పంపించినట్లు చెప్పారు. 


టీ సవారీ మొబైల్ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి ఈ ఆఫర్ అమలు 


7 ట్రిప్పులకు ఛార్జీ  చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం


14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ..45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం


20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ...45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం


30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే... 45 రోజుల్లో 45  ట్రిప్పులు తిరిగే అవకాశం


40 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ...60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం 


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM