తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..

byసూర్య | Fri, Oct 16, 2020, 04:45 PM

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. పసుపు పచ్చని తంగేడు.. తెల్లని గునుగు సహా తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి.. వాకిళ్లలో  సంప్రదాయ వస్త్రాలతో యువతులు గుంపులు గుంపులుగా చేరి ఆడిపాడే పండుగ వచ్చేసింది. బతుకమ్మ సంబురాలతో రాష్ట్రంలో పల్లెలు తొమ్మిది రోజుల పాటు కళకళలాడనున్నాయి. శుక్రవారం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే ఉత్సవాలు, సద్దుల బతుకమ్మ దాకా కొనసాగుతాయి. 


Latest News
 

డీజే వాహనం సీజ్ Fri, Apr 19, 2024, 01:11 PM
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM