సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ బండి సంజయ్

byసూర్య | Fri, Oct 16, 2020, 04:24 PM

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి.. ప్రజల్లో తిరగాలని డిమాండ్ చేశారు. బూట్ పాలిష్ గ్యాంగ్‌ను పంపకుండా.. సీఎం స్వయంగా కాలనీల్లో పర్యటించాలన్నారు. లేకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఇవాళ దిల్‌సుఖ్ నగర్, గడ్డి అన్నారం, బైరామల్ గూడ, బంజారా కాలనీ తదితర ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయన.. అక్కడి ప్రజల అవస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరేళ్లలో చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. దీనికి టీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందేనన్నారు. 67వేల కోట్లు ఖర్చు చేశామన్నారని.. అవి ఏమయ్యాయో తెలపాలన్నారు. కాలనీలన్నీ మూసీ నదిలా మారాయని, కార్లన్నీ మునిగిపోయాయని అన్నారు. రేపటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు మునుగుతుందని ఎద్దేవా చేశారు. 


కేంద్రం సాయం చేయడానికి సిద్ధంగా ఉందని, ఐదువేల కోట్లు అడుగుతున్న కేసీఆర్.. కోవిడ్ నిధులు దారి మళ్లించారని ఫైర్ అయ్యారు. అన్నీ కేంద్రం ఇస్తే... సీఎం ఎందుకున్నారని, ఎవరికోసం ఉన్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఉత్తగా ఇస్తున్నారా అంటూ కేంద్రంపై విరుచుకుపడే కేసీఆర్... రాష్ట్ర ప్రభుత్వమేమైనా ప్రజలకు ఉత్తగా ఇస్తుందా అని ఘాటుగా ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల్లోని వారికి తిండి, నీళ్లు, కరెంట్ లేవని, వస్తువులన్నీ నానిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు పేరాల శేఖర్ రావు, రంగారెడ్డి జిల్లా(అర్బన్) అధ్యక్షులు సామ రంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ వంగా మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొర్లపల్లి స్వామి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు యశ్పల్ గౌడ్, బీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు అంబాల మల్లేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.  


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM