స్మార్ట్ టీవీ నుంచి స్మార్ట్‌వాచ్ వరకు..భారీ డిస్కౌంట్స్

byసూర్య | Fri, Oct 16, 2020, 03:57 PM

మీరు ఎంఐ ఎల్ఈడీ టీవీ తీసుకోవాలనుకుంటున్నారా? షావోమీ స్మార్ట్‌వాచ్ కొనాలనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది షావోమీ ఇండియా. దివాళీ విత్ ఎంఐ పేరుతో సేల్ ప్రారంభించింది. అక్టోబర్ 16న ప్రారంభమైన సేల్ అక్టోబర్ 21 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ప్రకటించింది షావోమీ. అయితే షావోమీకి చెందిన స్మార్ట్ ప్రొడక్ట్స్ టీవీలపైనా ఆఫర్స్ ఉన్నాయి. షావోమీ గోల్డ్, ప్లాటినం, డైమెండ్ వీఐపీ సభ్యులు ముందే డీల్స్ పొందొచ్చు. ఎంఐ ప్రొడక్ట్స్‌పై రూ.2,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. షావోమీ అధికారిక వెబ్‍సైట్‌లో ఈ సేల్ కొనసాగనుంది. వీటిలో కొన్ని ఆఫర్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో కూడా లభిస్తాయి. ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్ ఈఎంఐ లాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి.
ఎంఐ దివాళీ సేల్‌లో భాగంగా ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ధరను రూ.300 తగ్గించింది. ప్రస్తుతం రూ.1,999 ధరకే కొనొచ్చు. ఫ్రీ డెలివరీతో పాటు 10 రోజుల రీప్లేస్‌మెంట్ కూడా ఉంది. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ఫీచర్స్ చూస్తే 0.95 అంగుళాల అమొలెడ్ టచ్ డిప్‌ప్లే ఉంటుంది. రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, స్టెప్ కౌంటర్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటరింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 20 రోజులు వాడుకోవచ్చు. ఎంఐ టీవీ 4ఏ ప్రో అసలు ధర రూ.22,499 కాగా ఆఫర్ ధర రూ.21,999. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్రీ ఇన్‌స్టాలేషన్ సర్వీస్ అందిస్తోంది షావోమీ.
ఎంఐ టీవీ స్టిక్ ధర రూ.500 తగ్గింది. ప్రస్తుతం రూ.2,299 ధరకే కొనొచ్చు. ఎంఐ బాక్స్ 4కే ధర రూ.200 తగ్గింది. ధర రూ.3,299. ఫ్రీ డెలివరీతో పాటు 10 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ కూడా ఉంది. ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫయర్ ధర రూ.2,000 తగ్గింది. ఎంఐ దివాళీ సేల్‌లో రూ.10,999 ధరకే కొనొచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో కొంటే మరో రూ.1,000 తగ్గుతుంది. బజాజ్ ఫిన్ సర్వ్ క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ ఉన్నాయి. ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ధర రూ.1,000 తగ్గింది. ప్రస్తుత ధర రూ.2,999.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM